- కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశం.
ముద్ర ప్రతినిధి, మెదక్: సిఎంఆర్ నిర్ణీత సమయంలో డెలివరీ చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.రబీ 2023-24 సీఎంఆర్ డెలివరీ సంబంధించి నర్సాపూర్ లోని సాయికృష్ణ రైస్ మిల్లును పౌరసరఫరాల అధికారి నిత్యానందం, అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ అబ్దుల్ నిసార్ తో కలిసి సీఎంఆర్ పెండింగ్ పై పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ… రబీ (యాసంగి) 2023-24 సీజన్ కు సంబంధించి జిల్లాలోని 67 మిల్లులకు 2,52,013 మెట్రిక్ టన్నుల ధ్యానాన్ని కేటాయించడం జరిగిందన్నారు. ఇందుకుగాను మిల్లర్లు 1,70,791 మెట్రిక్ టన్నుల బియ్యానికిగాను 1,64,826 మెట్రిక్ టన్నుల బియ్యం, (96.51%) ఇప్పటికే మిల్లింగ్ చేసి డెలివరీ చేయగా ఇంకా 5,965 మెట్రిక్ టన్నులు డెలివరీ చేయాల్సి ఉందన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా రైస్ మిల్లర్లు సీఎంఆర్‌ను నిర్ణీత సమయంలో అనగా ఈనెల 27 తేదీలోపు డెలివరీ చేయాలన్నారు. లేనిచో సదరు మిల్లులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైస్ మిల్లర్ యజమానులు, సివిల్ సప్ప్లై అధికారులు సమన్వయంగా పని చేసి నిర్ణీత గడువులోగా సీఎంఆర్ ను డెలివరీ చేయాలని ఆదేశించారు.
