Take a fresh look at your lifestyle.

మునుగ టీ ని ప్రారంభించిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

యాదాద్రి ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ మహిళలు తయారు చేసిన మునుగ టీ ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్ లు భాస్కర్ రావు, వెంకారెడ్డి తో కలిసి కలెక్టరేట్లో సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మహిళలు చేసిన టీ ఉత్పత్తుల గురించి తెలుకొని ఇలాంటి కొత్త తరహా ఆలోచలనతో ముందుకి సాగుతూ వారి జీవన ప్రమాణాలని మెరుగుపర్చుకోవాలని దానికి ప్రభుత్వం తరుపున సహకారం కూడా ఇస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, రమణా రెడ్డి, మాధవి, జిల్లా అధికారులు, ప్రాసెసింగ్ యూనిట్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.