Take a fresh look at your lifestyle.

చిన్నారులను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి అవగాహన కల్పించాలి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
చిన్నారులను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అవగాహన కల్పించాలని సిడబ్ల్యుసి చైర్మన్ బండారు జయశ్రీ అన్నారు. మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ డైరెక్టర్ శేక్.హమీద్ పాశ ఆధ్వర్యంలో మండలం హన్మాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల,ఉన్నత పాఠశాల విద్యార్తినిలకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు సురక్షితమైన స్పర్శ (ప్రేమ), అసురక్షిత స్పర్శ (భయం/అసౌకర్యం) మధ్య తేడాను, ప్రైవేట్ భాగాల గురించి, అలాగే ఎవరైనా ఇబ్బంది పెడితే “వద్దు” అని గట్టిగా చెప్పి, వెంటనే నమ్మకమైన పెద్దలకు తెలియజేయడం వంట నేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ దశరథ, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు లావణ్య, చింత ఉమ కోశాధికారి, స్వాతి, అనిత, నాగరాణి, ఉపాద్యాయులు టి. బాలమణి, ఏస్.పద్మ శ్రీదేవి,రహీమున్నిసా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.