ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి
ఈ నెల 31న జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు.సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 17న వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించినట్లు తెలిపారు.మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినట్లు చెప్పారు.సోమవారం జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు.దీంతో మిగిలిన ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. బేలిదే శ్రీనివాసులు, బిక్కుమళ్ల ఉపేందర్, కలకోట లక్ష్మయ్య, కుక్కడపు శ్రీనివాసరావు, మీలా వంశీ, మిట్టపల్లి రమేష్ పోటీలో ఉన్నట్లు తెలిపారు.ఈ నెల 31న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 వరకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ,ఓటు వేసే వారు తమ వెంట ఆధార్ కార్డును తీసుకురావాలని తెలిపారు.