Take a fresh look at your lifestyle.

రక్తదానం ప్రాణదానంతో సమానం, ఇది సాటి మనిషికి మీరు ఇచ్చే వెలకట్టలేని బహుమతి జనసేన నాయకులు: ప్రేమ కుమార్

 

హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి : చత్రపతి ధర్మరక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షులు కర్ర వేణుగోపాల్ ఆహ్వానం మేరకు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలలో భాగంగా ముసాపేట్, గూడ్స్ షెడ్ రోడ్ పినాకిల్ క్యాంపస్ లో జరిగిన రక్తదాన శిబిరానికి ప్రత్యేక అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ MLA అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ తల సేమియా సికిల్ సెల్ సొసైటీ డైరెక్టర్ రత్నావళి , వై శ్రీదేవి విచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్ర పటానికి పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు,
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ,’’శివాజీ మహారాజ్ ధైర్యం, పరాక్రమం, స్వాభిమానమే మనకు ఆదర్శం. యువత దేశభక్తితో, నైతిక విలువలతో ముందుకు సాగాలి అని పేర్కొని, రక్త దానం చేసిన యువతకు సర్టిఫికెట్, పండ్లు ఇచ్చి, ఒక రక్తదానం ద్వారా 3 మంది ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుంది.తలసేమియా, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు వంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరం అని యువతను,నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.