Take a fresh look at your lifestyle.

. కాషాయ మయమైన తాండూర్ పట్టణం

అంగరంగ వైభవంగా కొనసాగిన శివాజీ మహారాజ్ శోభ యాత్ర
. ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందూ హృదయ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. పార్టీలకతీతంగా అన్ని హిందూ సంఘాల నాయకులు బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, హిందూ కేంద్ర సమితి తదితర హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాళిక దేవి ప్రాంగణం నుండి వినాయక్ చౌక్, ఇందిరా చౌక్, పురవీధుల గుండా చత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ మొగలు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన, ధీరుడు, ధైర్యశాలి ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని వారు కోరారు. చత్రపతి శివాజీ దేశభక్తి ధైర్య సాహసాలు ప్రతి యువతలో పెంపొందాలని, ప్రతి హిందువు ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని నేటి తరానికి తెలియజేయాలని వారు కోరారు.

Leave A Reply

Your email address will not be published.