Take a fresh look at your lifestyle.

జోగిపేట బస్టాండ్ లో బారీ చోరీ

12 తులాలు బంగారం చోరి..సుమారు రూ.18 లక్షలు
సంగారెడ్డి, ముద్ర ప్రతినిది:
జోగిపేట బస్టాండ్లో గురువారం భారీ చోరి జరిగింది. వివరాల్లోకి వెళితే అల్లాదుర్గంకు చెందిన చెగురి లక్ష్మిదేవి హైద్రాబాద్లో జరిగే మనవడి వివాహానికి వెళ్లేందుకు బయలుదేరింది. జోగిపేటలో వారి బంధువులను వెంట తీసుకువెళ్లేందుకు బస్టాండులో దిగింది. ఆమే వియ్యంకురాలు, బంధువులు రావడంతో వారందరు కలసి బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమే బ్యాగ్ ఎత్తుకొని పారిపోయారు. అందులో 12 తులాల బంగారు ఆభరణాలు,.రూ.8వేల నగదు ఉన్నట్లు ఆమే పిర్యాదులో పేర్కొంది. మనవడి వివాహం కోసం పెద్దశంకరంపేటలోని నాలుగు రోజుల క్రితం బ్యాంక్ లాకర్లో నుంచి పెద్దగోలుసు, కంకణాలు, నాను, ఒంక ఉంగరం, సాదా ఉంగరంతో పాటు రూ.8 వేల నగదు బ్యాగ్లో ఉన్నట్లు ఆమే పేర్కొంది. పిర్యదు మేరకు కేసు నమోదు చేసి సీసీ పుటేజీ పరిశీలిస్తున్నట్లు సీఐ అనిల్ కుమార్ తెలిపారు.
తరుచూ ఇలాంటి సంఘటనలు
గత మూడు మాసాల క్రితం జోగిపేట బస్టాండ్లో వృద్దురాలి వద్ద నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగ్ ఎత్తుకొని పోయారు. 7 తులాలు బంగారం బ్యాగ్లో ఉన్నట్లు ఆమే పిర్యాదు చేసింది. పక్షం రోజుల క్రతం మల్లన్నకాలనీ, ఇందిరానగర్ కాలనీల్లో గుర్తు తెలియని వ్యక్తులు మూడు ఇండ్ల తాళాలు ధ్వంసం చేసి ఇంటిలోని బీరువా తెరిచి బంగారం, విలువైన పత్రాలు దొంగిలించారు, ఇంత వరకు పోలీసులు ఛేదించలేకపోయారు. గత మూడు నెలల క్రితం టేక్మాల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భత్తుల వీరప్ప తన కుటుండంతో వాహనంలో వస్తుండగా మార్గ మధ్యలో అల్మాయిపేట ప్రధానరహదారిపై మధ్యం సేవించి ఉన్న యువకులు భార్యభర్తలపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. పోలీసులు వైపల్యం కారణంగా ఇటువంటి సంఘటనలు తరుచు జరుగుతున్నట్లు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.