గొల్లపల్లి, ముద్ర విలేకరి : జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్ అంగన్ వాడి సెక్టార్ లోని ఇబ్రహీం నగర్ మొదటి,మూడవ సెంటర్ లో సూపర్వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం పై తల్లులకు అవగాహన కల్పించిన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు పిల్లలకు ఆటపాటలు, కథలతో పాటు సంభాషణ నైపుణ్యాలు నేర్పుతరాని వారు చెప్పారు.చిన్నప్పట్నుంచే మంచి అలవాట్లు అలవర్చుకునేలా సంసిద్ధం చేస్తురని,వర్క్ బుక్స్ గురించి తల్లులకు తెలియజేయడం జరిగిందాని,కొత్తగా ప్రవేశించే పిల్లలను తల్లులను సెంటర్ కి ఆహ్వానించి సెంటర్లో వివిధ సదుపాయాల గురించి తల్లులకు తెలియజేయడం జరిగిందాని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో తల్లులు, పిల్లలు, అంగన్వాడీ సూపర్వైజర్ జ్యోతి, టీచర్లు రమాదేవి, రాధ ఆయాలు తదితరులు పాల్గొన్నారు.