దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్నారని ప్రిన్సిపాల్ సెక్రటరీ కమిషనర్ కు వినతి..
తక్షణమే కొండపైన షాపులను టెండర్ నిర్వహించాలి : బిజెపి పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్
ముద్ర, యాదగిరిగుట్ట :
కొండపైన దుకాణాలను రెన్యువల్ చేయకుండా చూడాలని దేవాదాయ ధర్మాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ కు ప్రతి పత్రాన్ని అందించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం కొండపైన వర్తక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 10 దుకాణాలను టెండర్లు వేయాలని స్థానికులు వ్యాపారస్తులు నిరుద్యోగులు భూ బాధితులు ఉపాధి దిశగా కోరుతున్నారు. కొండపైన వర్తక సంఘం పేరిట 112 తాత్కాలిక దుకాణాలకు గాను 10 దుకాణాలు కొనసాగుతున్నాయి. వచ్చేనెల మే 31న గడువు ముగుస్తుంది. ప్రతి సంవత్సరం దేవస్థానం పరిధిలో టెండర్ల ప్రకటనలు జారీ చేస్తూ పాత కొత్తవారికి అవకాశాలు కల్పిస్తారు. అందులో భాగంగా కొండ పైన ఉన్న దుకాణాలను టెండర్లు వేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కొండపైన షాపులను టెండర్లు వేలం ద్వారా దేవస్థానానికి సుమారు రూ. 20 నుంచి 30 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్తుంది అన్నారు.

కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని ఎన్నో ఏండ్లుగా కొండపైన దుకాణాలను ఏర్పాటు చేసుకొని వాటిని రెన్యువల్ చేస్తూ టెండర్ వేయకుండా వివిధ రాజకీయ పార్టీల ,ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నటువంటి వర్తక సంఘాన్ని తక్షణం రద్దు చేయాలని స్థానిక యువకులకు ఉపాధి కల్పించాలన, ఎండోమెంట్ చట్టం ప్రకారం ఒక దుకాణాన్ని కూడా ఇన్ని సార్లు రేన్యువల్ చేయడం చట్ట విరుద్ధం మరి చట్టాలు వీళ్లకు వర్తిచావా…? రేన్యువల్ కోసం భారీ ఎత్తున డబ్బులు చేతులు మారేందుకు సమయం ఆసన్నమైందని ఈసారి గనుక షాపులను రెన్యువల్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కొండపైన ఉన్న వర్తక సంఘం పేరిట కొనసాగుతున్న తాత్కాలిక దుకాణాలను టెండర్లు వేయకుండా ఉన్నప్పుడు మిగతా దుకాణాల ఇతర టెండర్లు కూడా వేయకూడదు. ఎందుకంటే అన్ని దేవస్థానానికి సంబంధించినవి కాబట్టి అందరికీ ఒకే న్యాయం ఒకేరోజు ఉండాలి కానీ ముడుపులు ఇచ్చే వారికి ఒక రూల్ ముడుపులు ఇవ్వని వారికి ఇంకొక రూల్ ఉండకూడదు ఏ టెండర్లైన పారదర్శకంగా ఉండాలని బిజెపి పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజి నరేష్ శివరాత్రి శ్రీశైలం ,బోగా అజయ్ ,శ్రీనాథ్ ,విజయ్ ,ప్రవీణ్ శ్యామ్ పాల్గొన్నారు.