Take a fresh look at your lifestyle.

నిర్విరామంగా కొనసాగుతున్న సహాయక చర్యలు

  • కార్మికుల ఆచూకీ కై కొనసాగుతున్న నిరంతర ప్రయత్నాలు.
  • ఎస్ ఎల్ బి సి, టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి .

అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గల ఎస్ ఎల్ బి సి, సొరంగం లోపల జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు జరుగుతున్న సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నట్లు, సహాయక బృందాల ఉన్నతాధికారులతో ప్రతి రోజూ సమీక్ష నిర్వహిస్తూ, ఏ రోజుకారోజు చేపట్టవలసిన చర్యలపై, సహాయక చర్యలకు కావలసిన సామాగ్రిని,సిబ్బందిని సిద్ధం చేస్తూ, సహాయక చర్యలకు ఆటంకంగా వున్న సమస్యలను అధిగమిస్తూ, వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి వివరించారు.ఫిబ్రవరి 22వ తేదీ నుండి టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక బృందాలు ప్రతి రోజూ సహాయక చర్యలు చేపడుతున్నారని, నిరంతరాయంగా మట్టి తవ్వకాలు జరిపి కన్వేయర్ బెల్టు ద్వారా మట్టి నీ టన్నెల్ బయటకు తరలిస్తున్నట్లు , టిబిఎం భాగాలను కటింగ్ చేస్తు లోకో ట్రైన్ ద్వారా టన్నేల్ బయటికి చేరవేస్తున్నట్లు,నిరంతరాయంగా వస్తున్న ఊట నీటిని అత్యధిక సామర్థ్యం గల పంపుల ద్వారా బయటికి తరలిస్తున్నట్లు వివరించారు.ప్రతి రోజూ మూడు షిఫ్టుల్లో సహాయక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటు సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలియజేశారు.ఈ సమీక్ష సమావేశంలో, ఆర్మీ అధికారులు, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్ కుమార్ సింగ్, ప్రతినిధులు, ఎస్ డి ఆర్ ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారులు, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.