Take a fresh look at your lifestyle.

టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి నగదు చెల్లింపులు రద్దు అన్ని రాష్ట్రాలకు కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్‌ప్లాజాల్లో నగదు చెల్లింపులు నిలిపివేసింది. ఇకనుంచి అన్నీ డిజిటల్ పేమెంట్సే ఉండాలని ఆదేశించింది. వచ్చే ఏప్రిల్ ఒకటో తేది నుంచి దీనిని పక్కాగా అమలు చేయాలని కేంద్ర రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. టోల్‌ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదాచేయడం, రుసుముల వసూళ్లలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ప్లాజా నుంచి వాహనాలు వెళ్తున్నప్పటికీ కొన్ని వాహనాలు అప్పటికప్పుడు నగదు చెల్లించి వెళ్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పూర్తిస్థాయిలో నగదు రహిత చెల్లింపులతోనే టోల్‌ప్లాజాలు నడవనున్నాయి. గడువు సమీపిస్తుండటంతో డిజిటల్‌ చెల్లింపులకు మారేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని వాహనదారులకు అధికారులు సలహాలు ఇస్తున్నారు. ఫాస్టాగ్‌ లేదా యూపీఐ చెల్లింపుల విధానం వల్ల ప్రయాణాలు వేగవంతమవుతాయి, ఇంధనం ఆదా అవుతుంది. పారదర్శకత వస్తుంది. చిల్లర లేదా రశీదుల కోసం వేచి ఉండవలసిన అవసరం ఉండదని చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.