Take a fresh look at your lifestyle.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

  • ప్రభుత్వ సలహాదారు పోచారంనకు వినతి.

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: టిజి ఇ జెఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా,ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు 57 సమస్యల పరిష్కారానికి, ప్రజా ప్రతినిధులకు మెమొరాండం సమర్పించడం లో భాగంగా శనివారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలో, బాన్సువాడ శాసనసభ్యుడు, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై మెమోరాండం సమర్పించారు.ఉద్యోగుల సమస్యల పై పోచారం శ్రీనివాస్ రెడ్డికి 5పెండింగ్ 5డీఏలు, PRC, హెల్త్ కార్డులు, సిపిఎస్ రద్దు, పెన్షనర్ల బకాయిలు, ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యూలరైజ్ తదితర 57 సమస్యలను జేఏసీ చైర్మన్ నరాల వెంకటరెడ్డి క్షుణ్ణంగా వివరించడం జరిగింది.ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి తో చర్చించి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను ప్రవేశపెట్టాలని మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, సమస్యలపై ప్రభుత్వానికి తెలియజేస్తాననీ నా మీద ఉన్న నమ్మకంతో మీ సమస్యలను నా దృష్టికి తీసుకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారు సానుకూలంగా స్పందించారు.TGJAC చైర్మన్ వెంకట్ రెడ్డి, సెక్రటరీ జనరల్ దేవేందర్, కుశాల్ తో పాటు ఈ కార్యక్రమంలో TGEJAC లో ఉన్నటువంటి 27 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.