Take a fresh look at your lifestyle.

అల్ఫోర్స్ ‘ లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం

ముద్ర, కరీంనగర్ :
భక్తితో సమాజంలో మెదలాలని తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారు వారి పరివారంతో కలిసి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో వారి సారథ్యంలో బ్రహ్మశ్రీ డా.గర్రెపల్లి మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహింపబడేటువంటి సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞాన్ని వేడుకగా సాంప్రదాయబద్ధంగా శ్రీరాముడికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 2000 శ్లోకాలు కలిగినటువంటి సుందరకాండలో అత్యద్భుతంగా విషయాలు తెలపడం జరిగిందని వారు చెప్పారు.
ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి నగరపాలక సంస్థ మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా* అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో సుందరకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకమన్నారు.
మరో ఆత్మీయ అతిథి సుడా చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సుందరకాండలోని విషయాల ద్వారా రామాయణం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోగలుగుతామని వారు చెప్పారు
ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ కార్పొరేటర్ వొంటల సత్యనారాయణ రెడ్డి, పలువురు ఆలయాల కమిటీల సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రవచనం అనంతరం పాల్గొన్న వారందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు

Leave A Reply

Your email address will not be published.