ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఆదివారం ఇంటర్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ఆర్ కళాశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో విజయకేతనం ఎగురవేశారు.
బైపిసి మొదటి సంవత్సరంలో
440 మార్కులకు ఇ. ఆరాధ్య 438 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. సఫా మహీన్ 437, జి.ఆలేఖ్య 436,
అయేషా రిధ 434, నవ్య 432 మార్కులు సాధించారు.
ఎంపిసి విభాగంలో
470 మార్కులకు సిమ్రా రహీన్ 465 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించారు. ఎస్.హర్షిణి – 464, ఎస్.సంజన 461,
శ్రీ వన్య 461, రక్షిత 460 మార్కులు సాధించారు.
ద్వితీయ సంవత్సరం ఎంపిసి విభాగంలో 1000 మార్కులకు గాను డి.శ్రీనిధి 993, అయేషా 990, శ్రీజ 990, శిరీష 990,
శృతిక 989, లక్ష్మి ప్రసన్న 989 మార్కులు సాధించారు.
ద్వితీయ సంవత్సరం బైపిసి విభాగంలో1000 మార్కులకు గాను బి. శ్రీలక్ష్మి 993, డి.గౌరి 992, కె.అఖిల 990, ఎం.శ్రీజ 989 మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, జోనల్ ఇంచార్జ్ నగేష్ యాదవ్, డీన్ రాంబాబు, ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి అభినందించారు.