రాష్ట్రస్థాయిలో సెకండ్ ఇయర్లో 10వ స్థానంలో నిలిచిన జగిత్యాల జిల్లా..
ఫస్ట్ ఇయర్ లో 13వ స్థానం…
జిల్లాలో గతేడాది కంటే ఇంటర్లో మెరుగైన ఫలితాలు…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ఇంటర్ ఫలితాలు జగిత్యాల జిల్లా గతంలో కంటే ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలను సాధించింది. అలాగే ఇంటర్లో రాష్ట్ర ఉత్తీర్ణతా శాతం 70% గా ఉంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో గతేడాది 56.34%తో 24వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 62.81% తో 13వ స్థానంలో నిలిచింది. అలాగే ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గత ఏడాది 68.73%తో 18వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 74.9% తో 10వ స్థానంలో నిలిచింది. మెరుగైన ఫలితాల కోసం కృషి చేసిన విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
ఇంటర్ ఫలితాల వివరాలు …
జగిత్యాల జిల్లాలో ప్రస్తుత సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరంలో 6645 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా ఇందులో 41 74 మంది విద్యార్థులు పాస్ కాగా, 62.81 శాతంతో రాష్ట్రంలో 13వ స్థానంలో నిలిచింది. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 5792 అందు విద్యార్థుల పరీక్షకు హాజరు కాగా ఇందులో 4338 మంది విద్యార్థులు పాస్ కాగా, 74.9%తో రాష్ట్రంలో పదో స్థానంలో నిలిచింది. ఇక జనరల్ ఇంటర్ మొదటి సంవత్సరం ప్రైవేట్ లో మొత్తం 740 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఇందులో 242 మంది విద్యార్థులు పాసై 32.7%తో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. జనరల్ ఇంటర్ రెండవ సంవత్సరంలో మొత్తం 62 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఇందులో 41 మంది విద్యార్థులు పాసై 66.13%తో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. అలాగే ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ కోర్సులో మొత్తం 1055 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఇందులో 631 మంది విద్యార్థులు పాసై 59.81 శాతంతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సులో మొత్తం 833 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఇందులో 602 మంది విద్యార్థులు పాసై 72.27%తో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది.