ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
శ్రీ ఉమామహేశ్వర గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కొండనాగులలో నిర్వహించిన జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2026 పోటీల్లో ఆర్ట్స్ మరియు కామర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
“50 సంవత్సరాల భారత ప్రజాస్వామ్యంలో అత్యవసర పరిస్థితి నుంచి నేర్చుకున్న పాఠాలు” అనే అంశంపై జరిగిన ఈ పోటీల్లో బీఏ మొదటి సంవత్సరం విద్యార్థి జి. లోకేష్, బీకాం మూడవ సంవత్సరం విద్యార్థిని ఎస్. మాధవి ఉత్తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ నెల 28 నుండి 29 వరకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవాభివృద్ధి వనరుల కేంద్రం (MCR-HRD)లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యూత్ పార్లమెంట్ ఫెస్టివల్‌లో జి. లోకేష్ పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి, అధ్యాపకులు నరేష్, డా. కృష్ణ మరియు ఇతర బృంద సభ్యులు విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులను జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కళాశాలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.