ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాయక్వాడి జల కుమారి అధికారులను ఆదేశించారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో ఆమె జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను సమర్పించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.