Take a fresh look at your lifestyle.

గంట ముందే ఇంటికి రంజాన్ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం వెసులుబాటు

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ముస్లిం ఉద్యోగులు నెలరోజుల పాటు రోజూ గంట ముందే వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈనెల 19 నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ వెసులుబాటు అమల్లో ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, టీచర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. బోర్డులు, కార్పొరేషన్ల ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ మినహాయింపు ఉంటుందని ప్రకటించారు. ఈ ముస్లిం ఉద్యోగులు తమ ఆఫీసులు, స్కూళ్ల నుంచి ఒక గంట ముందుగానే ఇంటికి బయల్దేరేందుకు ఈ నెల రోజులు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు స్వాగతించారు.

Leave A Reply

Your email address will not be published.