Take a fresh look at your lifestyle.

రోడ్డు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాలి

  • సుమనళిని రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.

గండిపేట్ ముద్ర విలేకరి : మణికొండ మున్సిపాలిటీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ను అధికారులు స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించాల‌ని మణికొండ బీఆర్ఎస్ పార్టీ మహిళ నాయకురాలు ధర్మపురి సుమనళిని డిమాండ్ చేశారు.ఈ మేర‌కు శుక్ర‌వారం నిర్వ‌హించిన నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా అధికారుల నిర్ల‌క్ష్యాన్ని ఆమె త‌ప్పుప‌ట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పైపులైన్ రోడ్డు నుంచి అంజలి గార్డెన్ మీదుగా ల్యాంకో హిల్స్ కు వెళ్ళే రోడ్డు టీం 4 వారి డ్రైనేజ్ కారణంగా గత కొన్ని నెలలుగా బీటలు వారడం జ‌రుగుతుంద‌న్నారు.చిన్నపాటి మరమ్మత్తులు చేయడం మున్సిపల్ అధికారులకు పరిపాటి అయ్యింద‌న్నారు. ఈ విష‌యాన్ని ప్రజలు గమనిస్తున్నారనీ, ఈ విషయమై ఎన్నోమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యమని అన్నారు. ప్రజలకు ముప్పు జరుగక ముందే పర్యవసానంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.