Take a fresh look at your lifestyle.

లిటిల్ జీనియస్ హైస్కూల్లో వీడ్కోలు వేడుకలు

కోరుట్ల, ముద్ర: లిటిల్ జీనియస్ హైస్కూలు లో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు వీడ్కోలు వేడుకలను స్థానిక పిబి గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేశం, డాక్టర్ స్వీతి అనూప్ రావు హాజరయ్యారు.వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మంచి చదువును అభ్యసించి, ఉన్నత స్థానాన్ని పొందాలని, క్రమశిక్షణతో ప్రణాళికతో జీవితాన్ని దిద్దుకోవాలని అన్నారు.ఉన్నత విలువలు కలిగిన జీవితం ఉన్నత స్థానాన్ని స్థాయిని అందిస్తుందని, దాని కోసం నిరంతరం శ్రమించాలని చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో చదువుకోవడమే మార్గమని అన్నారు.థామస్ ఎడిషన్ జ్ఞానాన్ని పెంచుకొని బల్బును కనుగొనకపోతే మనం ఈరోజు చీకట్లో వుండే వారిమని, చిన్ననాటి నుండే పరిశోధనలు చేస్తూ కొత్త విషయాలను కనుగొని మంచి సైంటిస్టులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బండి మహాదేవ్, హైస్కూల్ ప్రిన్సిపాల్ కలకుంట్ల రాధాకృష్ణ, ప్రైమరీ ప్రిన్సిపాల్ వినోద, ప్రీ-ప్రైమరీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, పాఠశాల డైరెక్టర్ కొత్త రాజు, పాఠశాల అడ్వైజర్ కటుకం శుకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ బండి లావణ్య, జ్యోతి, పాఠశాల పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ సెక్రటరీ యూసుఫ్ అలీ, ఉపాధ్యాయులు ప్రమీల , సుధాకర్, జీవిత, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.