Take a fresh look at your lifestyle.

రామగుండం సీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

  • లొంగిపోయిన ప్రతి మావోయిస్టు కు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం ఫలితాలను అందచేస్తాం.
  • సిపి అంబర్ కిషోర్ జా.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీ కి చెందిన ఇరువురు సీనియర్ అజ్ఞాత నాయకులు రామగుండం కమిషనరేటు పోలీసుల ఎదుట సాయంత్రం లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం,పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్న వివిధ రకాల సహాయ సహాకారాలు, లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని, తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని,కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం ఎదుట కమిషనరేటు కార్యాలయంలో లొంగిపోయారు. మంగళవారం సాయంత్రం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టు దంపతుల గురించి పూర్తి వివరాలు వెల్లడించారు.ఆత్రం లచ్చన్న @ గోపన్న @ రాజప్ప, వయస్సు:65 సం.లు, పారపెల్లి గ్రామం,కోటపల్లి మండలం,మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం.రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్ సీఎం /ఇంచార్జీ డివిజన్ టెక్నికల్ టీం,నార్త్ బస్తర్ డివిసి,ఛత్తీస్గఢ్.1983 సంవత్సరం లో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ లో దళ సభ్యుని చేరి చెన్నూర్ దళం లో పనిచేశాడు.1988 సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ గా పదోన్నతి పొంది సిర్పూర్ దళానికి డిప్యూటీ కమాండర్ గా పనిచేశాడు.1989 సంవత్సరంలో చౌదరిఆంకుభాయి @ అనితక్క ని వివాహం చేసుకున్నాడు.ఆ తరువాత పార్టీ అతడిని 1995 వ సంవత్సరంలో టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసి పట్టణ ప్రాంతానికి పార్టీ పని నిమిత్తం పంపించారు.2002 సంవత్సరంలో డీసీఎం గా పదోన్నతి పొంది తిరిగి డీకే ఎస్ జెడ్ సి లోని టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ అయ్యాడు.2007 సంవత్సరంలో పార్టీ అతడిని నార్త్ బస్తర్ డివిసి టెక్నికల్ డిపార్ట్మెంట్ కి ఇంచార్జ్ గా నియమించింది. 2023 సంవత్సరంలో ఇతనికి డీకే ఎస్ జెడ్ సి ఎం గా పదోన్నతి లభించింది.లొంగిపోయేంతవరకు లచ్చన్న అక్కడే పనిచేస్తున్నాడు. ఆత్రం లచ్చన్న పై తెలంగాణ లోని వివిధ జిల్లాలలో 35 కేసులు నమోదచేబడ్డాయి.చౌదరి ఆంకుభాయి @ అనితక్క @ లక్ష్మి,భర్త ఆత్రం లచ్చన్న @ గోపన్న, వయస్సు:55 సం:లు, ఆగరగుడా గ్రామం,బెజ్జూర్ మండలం,కొమరంభీంఆసిఫాబాద్ జిల్లా,తెలంగాణ రాష్ట్రం.డీసీఎం, డివిజన్ టెక్నికల్ టీం,నార్త్ బస్తర్ డివిసి,ఛత్తీస్గఢ్.అనితక్క1988 వ సంవత్సరంలో తన అన్న చౌదరి చిన్నన్న ప్రోత్సాహంతో సిపిఐ ఎం.ఎల్ పి డబ్ల్యు లో దళ సభ్యురాలిగా చేరి సిర్పూర్ దళం లో పనిచేసింది. అలా సిర్పూర్ దళంలో పనిచేస్తుండగా సిర్పూర్ దళం డిప్యూటీ కమాండర్ గా పనిచేస్తున్న ఆత్రం లచ్చన్నని వివాహం చేసుకుంది.1995 వరకు సిర్పూర్ దళంలోనే పనిచేసి 1995 లో తన భర్తతో పాటు పట్టణ ప్రాంతానికి బదిలీ అయింది.2002 సంవత్సరంలో ఎస్ సి ఎం గా పదోన్నతి పొంది తిరిగి డీకే ఎస్ జెడ్ సి లోని టెక్నికల్ డిపార్ట్మెంట్ కి తన భర్త తోపాటుగా బదిలీ అయ్యింది. 2007 సంవత్సరంలో అనితక్క నార్త్ బస్తర్ డివిసి టెక్నికల్ డిపార్ట్మెంట్ కి బదిలీ అయ్యింది. లొంగిపోయేంతవరకు నార్త్ బస్తర్ డివిసి లోని టెక్నికల్ డిపార్ట్మెంట్ లో డీసీఎం పనిచేస్తుంది.చౌదరి ఆంకుభాయి పై కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో14 కేసులు నమోదు చేయబడ్డాయని
తెలిపారు.

  • మీ ఊరికి రండి!మావోయిస్టులకు పోలీస్ వారి ఆహ్వానం!!

రామగుండం కమిషనరేటు పోలీసు శాఖ తరుపున అజ్ఞాతం లో ఉన్న మావోయిస్టులను జన జీవన స్రవంతి లోకి రావలసిందిగా సిపి కోరారు.తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని, తెలంగాణ అభివృద్దికితోడ్పడాలని అన్నారు.అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్ల యితే,తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు ఇతర సహాయ సహకారాలు అందిస్తుంది.వారు స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం వారికి అన్నీవిధాల తోడ్పాటును అందిస్తుందన్నారు.లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందజేయడానికి రామగుండం కమిషనరేటు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు .

  • ప్రజా సంఘాల ముసుగులో దందాలు.

కొంతమంది వ్యక్తులు ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతి లో వ్యవహరిస్తున్నారు.అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగు తుంది.వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. యువత, ప్రజలు ఇటువంటి వారికిదూరంగా ఉండాలని కోరారు. మావోయిస్టులకు నేటి యువత దూరం
ప్రస్తుత సమాజంలో యువత చైతన్యవంతంగావ్యవహరిస్తున్నదిచట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిపోయింది. చదువుతున్న వారు ఎవరు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం లేదు. కాలం చెల్లిన సిద్ధాంతం మావోయిజం నేటి ప్రపంచంలో మావోయిజం కాలం చెల్లిన సిద్ధాంతంగా మిగిలిపోయింద న్నారు. హింసను ప్రేరేపించే సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారు.ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ మావోయిజం కనుమరుగైపోయింది అన్నారు. పోరు వద్దు!! ఊరు ముద్దు!! ఆయుధాలను, అజ్ఞాతాన్నివీడండిజనజీవన స్రవంతిలో కలవండని సిపి కోరారు.

Leave A Reply

Your email address will not be published.