Take a fresh look at your lifestyle.

రిజర్వ్ బ్యాంక్ ఆర్దిక వారోత్సవాలు.

మోత్కూర్ ముద్ర న్యూస్:

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆదేశానుసారం మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామం లో ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరస్యత పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లీడ్ బ్యాంకు మేనేజర్ శివరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఆర్థికంగ ఎదగాలి అంటే ముందుగ వస్తున్న ఆదాయం నుండి పొదుపు చేసుకోవటం అలవాటు చేసుకోవలి న్నారు.ఆ పొదుపు ఆర్ బి ఐ గుర్తింపు పొందిన సంస్థ లలో మాత్రమే చేసుకోవాలని, ప్రవేట్ వ్యక్తులను, సంస్థలను,నమ్మి మోసపోవద్దని అన్నారు.వృధా ఖర్చులు చేయకుండా తమ కుటుంబ అవసరాల కోసం మాత్రమే డబ్బులు ఖర్చులు పెట్టుకుని మిగతా డబ్బులు పొదుపు చేసుకోవాలన్నారు. ముఖ్యంగ మహిళలు స్వయం సహాయక సంఘాల నుండి తీసుకునే రుణాలు,ఆదాయ వనరులు పెంచుకునే విధంగా ఉండలని అని అన్నారు.బ్యాంకు ఖాతా లేకుంటే జరిగే నష్టాలను గురుంచి వివరిస్తూ,బ్యాంకు లో ఖాతా తెరవటం తో కలిగే ప్రయోజనాలు,రుణాలు,సాధారణ భద్రత పథకాలు ఖాతా దారునికి లభిస్తాయని,18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ భద్రత పథకాలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో, డిపిఎం, వెంకటేశ్వర్లు. అడిషనల్ డిఆర్డిఓ, జంగారెడ్డి.ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ మోత్కూరు అడ్డగూడూరు ఏపీఎంలు, ఫకీరయ్య,కళావతి. కౌన్సిలర్స్ యుగంధర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.