Take a fresh look at your lifestyle.

మే 6 నుంచి టీజీ ఆర్టీసీ కార్మికుల సమ్మె

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఆర్టీసీ ప్రత్యేక సమ్మెకు శంఖం పూరించింది.మే 6 ఆర్థరాత్రి నుంచి సమ్మె ఉంటుందని ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది.ఈ మేరకు సోమవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీసులు జారీ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించపోతే మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ పేర్కొంది.కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని, ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పడలేదని నోటీసులో పేర్కొన్నారు.ఇదిలావుండగా ఈ ఏడాది జనవరి 27న తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ సంస్థకు నోటీసులు ఇచ్చింది.ఆ నోటీసులకు యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగేందుకు ఆర్టీసీ జేఏసీ సిద్ధమైంది. కాగా తమ సమ్మెకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని యూనియన్లు కలిసిరావాలని వారు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.