Take a fresh look at your lifestyle.

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వ్యక్తి మృతి

 వికారాబాద్, ముద్ర : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండల పరిధిలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధారూర్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన కంది శ్రీనివాస్ (31) రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.మృతుడు రుద్రారం నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి ఎబ్బనూరు నుంచి వికారాబాద్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు.అదే సమయంలో చింతకుంట గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వికారాబాద్ వైపు నుంచి చింతకుంటకు వెళ్తున్నాడు. యబ్బనూరు మలుపు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకున్నాయి.ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన నరసింహులను చికిత్స నిమిత్తం వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.అతనికి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మరింత మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి సిఫారసు చేశారని పోలీసులు తెలిపారు.ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.