- 103 గ్రాముల బంగారం,125 గ్రాముల వెండి ,ఒక ద్విచక్ర వాహనం స్వాదీనం….
కోరుట్ల/మెట్ పల్లి, ముద్ర; మెట్ పల్లి డివిజన్ ప్రాంతాల్లో పలు దొంగ తనాలకు పాల్పడుతున్న దొంగను పట్టుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం రోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన మిట్టపెల్లి లక్ష్మణ్, పుండలిక్ విజయ్ అనే ఇద్దరు వ్యక్తులు మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ గా చేసుకొని ఆ ఇంట్లో ఉన్న బీరువాలో బంగారు, వెండి, నగదును అందిన కాడికి దోచుకు వెళ్ళేవారని, వీరిపై 40 కేసులు అండగా 28 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, 10 కేసుల్లో కోర్టు జైలు శిక్ష విధించింది.
గత సంవత్సరం బెయిల్ పై బయటకు వచ్చి మళ్ళీ జల్సాలకు అలవాటు పడి జనవరిలో జగిత్యాల జిల్లా లోని మల్లాపూర్ మండలం ముత్యంపేట్, సిర్పూర్, మేడిపల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలోని పలు ఇళ్ళల్లో చొరికి పాల్పడ్డారు. మంగళవారం రోజు సాయంత్రం పోలిసులు వాహన తనిఖీ చేపడుతుండగా పట్టుకున్నట్లు పోలిసులు వెల్లడించారు. అతన్ని విచారించగా 103 గ్రాముల బంగారం, 125 గ్రాముల వెండి ఒక ద్విచక్ర వాహనం స్వాదీనం చేసుకున్నట్లు వాటి విలువ సుమారుగా 11 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు సిఐ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. దొంగలు పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి, మల్లాపూర్ ఎస్సై కే. రాజు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్పల్లి డిఎస్పి రాములు ప్రత్యేకంగా అభినందించారు.