ముద్ర, వీపనగండ్ల: కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని కొల్లాపూర్ పట్టణంతోపాటు పెంట్లవెల్లి మండల కేంద్రంలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హిందూ హృదయ సామ్రాట్,గెరిల్లా యుద్ధతంత్రంతో విదేశీయులకు ముచ్చెమటలు పట్టించిన మరాఠా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెంట్లవెళ్లి మండల కేంద్రంలో మరియు కొల్లాపూర్ పట్టణంలో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ మరో ఛత్రపతి శివాజీ ల మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో మనమందరం శత్రు దేశాలకి మరియు మిత్రు దేశాలకి దీటుగా సగౌరవంగా మెలగడాన్ని అభినందిస్తూ కొల్లాపూర్ నియోజకవర్గంలో కూడా నరేంద్రుడి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకోవాలని స్పష్టం చేశారు..ఈ కార్యక్రమంలో ఎల్లేనితో పాటు బీజేపీ మరియు భజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
