- వాటి జోలికి పోమనే ప్రకటన చేయాలి.
- భూములను వ్యాపార వస్తువుగా చూడొద్దు.
- విద్యార్థులను కొడుతుంటే..భూములు అమ్మే ప్రయత్నం చేస్తే చూస్తు ఊరుకోం.
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో పునరాలోచించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రభుత్వానికి సూచించారు. ఆ భూములను వ్యాపార వస్తువుగా చూడొద్దన్న ఆయన వాటి జోలికి పోమనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థులను కొడుతుంటే..భూములు అమ్మే ప్రయత్నం చేస్తే చూస్తు ఊరుకోమని స్పష్టం చేశారు.శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.పారిశ్రామీకరణ, అభివృద్ధి నేపథ్యంలో భూముల ధరలు పెరగడంతో అందరి కన్ను సెంట్రల్ యూనివర్సిటీ భూముల పై పడిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ హయాంలోనే హెచ్‌సీయూకు భూములు కేటాయించారనే విషయాన్ని కాంగ్రెస్ సర్కార్ గుర్తించాలన్నారు. భూముల విషయంలో ప్రభుత్వానికి మేము చెబితే వినిపించుకోవడం లేదన్నారు. మిత్రపక్షంగా తాము తమ అభిప్రాయం మాత్రమే చెప్పగలుగుతామన్నారు.రాజకీయాలు మిత్ర బంధాలు వేరు..ప్రస్తుత హెచ్‌సీయూ భూముల సమస్య వేరు అని స్పష్టం చేశారు.వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేర్ ఆస్పత్రి యాజమాన్యం అక్కడ ఆసుపత్రి కోసం సహకరించాలని కోరిందన్నారు. విద్య వ్యవస్థకే ఆ భూములని అప్పట్లోనే తాము స్పష్టం చేశామని గుర్తు చేశారు.విద్య వ్యవస్థ విస్తృతికి ఈ భూములు ఉపయోగించాలని నారాయణ కోరారు. జనాభా పెరుగుతుంది కానీ, భూమి పెరగదన్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని సర్కార్.. ప్రభుత్వ భూములు అమ్మ కూడదన్నారు.గత ప్రభుత్వాలు భుములు అమ్మారు అంటున్నారు. వాళ్లు ఇప్పుడు అపోజిషన్‌లో ఉన్నారన్నారు.చట్ట ప్రకారం ఈ భూములు ప్రభుత్వానికి వచ్చాయన్న నారాయణ.. రేవంత్ రెడ్డికి ఆ భూములు ఇవ్వలేదన్నారు.రాజకీయాల్లో ఎవరికి ఎవరు శాశ్వత మిత్రులు కాదు.. శాశ్వత శత్రువులు కాదనే విషయాన్ని కాంగ్రెస్ సర్కార్ గమనించాలని హితవు పలికారు.