Take a fresh look at your lifestyle.

కేసీఆర్… సిట్ ముందు నిజాలు చెప్పాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

 
ఫోన్ ట్యాపింగ్ పై కవితే బాధపడుతోంది

ముద్ర, వేములవాడ :
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో విచారణకు హాజరవుతున్న మాజీ సీఎం కేసీఆర్… సిట్ అధికారుల ముందు నిజాలే చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేసీఆర్ వయసు ఆధారంగా ఆయనకు సిట్ అధికారులు గౌరవం ఇస్తారని చెప్పారు. కేసీఆర్ కూడా చట్టానికి సహకరించాల్సిందేనన్నారు. సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పబడుతోన్నబీఆర్ఎస్ నేతలపై ఆయన ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. గురువారం వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్‌తో తన రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టారన్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చే అధికారం సిట్‌కు ఉందన్న ఆయన.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో వచ్చిన విషయాల ఆధారంగా కేసీఆర్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారని తాము భావిస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు అందరూ ఎందుకు గగ్గోలు పెడుతున్నారో తెలియడం లేదన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్లుగా హరీష్ రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రాష్ట్ర ఆత్మగౌరవం తెలంగాణ అమరవీరుల త్యాగాల్లో ఉంటుందని చెప్పారు… ఈ విషయాన్ని హరీష్ రావు తెలుసుకోవాలని సూచించారు. గతంలో అనేక మంది సీఎంలు, మాజీ సీఎంలు విచారణలకు హాజరయ్యారన్నారు. కానీ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వగానే ఏదో జరిగిపోతుందని హడావుడి చేస్తున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.