Take a fresh look at your lifestyle.

108 కలశాలతో ఘనంగా కోటి తలంబ్రాల దీక్ష గోటి తలంబ్రాలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు

 

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :

భద్రాచల రాములోరి కళ్యానానికి 108 కలశాలతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా కొండపాకలోని మార్కండేయ దేవాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపల, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భద్రాచలం నుండి తీసుకొచ్చిన గోటి తలంబ్రాలు 108 కలశాలలో నింపి రామ నామ స్మరణ చేసుకుంటూ గ్రామ పురవీధుల గుండా కాషాయ జెండాలు, కలశాలతో భారీ ర్యాలీతో రామాలయం రుద్రేశ్వారాలయం చేరుకొని అక్కడి నుండి మార్కండేయ దేవాలయానికి చేరుకొని వడ్లను ఓలిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామకోటి రామరాజు భక్తులచే 3 గంటల పాటు రామనామ స్మరణ చేయిస్తూ గోటితో వడ్లను ఓలిచి తలంబ్రాలుగా మార్చారు. అక్కడే రామకోటి రామరాజుకు అందజేశారు. ఈ సారి కళ్యానానికి 3క్వింటాల గోటి తలంబ్రాలు అందిస్తూన్నానని రామకోటి రామరాజు తెలిపారు. అనంతరం భక్తులు తమ ఆనందాన్ని వ్యక్త పర్చారు. మేము భద్రాచలం వెళ్లలేక పోయిన కూడా తాము ఓలిచే తలంబ్రాలు భద్రాచల కళ్యానానికి వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని మొదటిసారిగా మా గ్రామానికి అవకాశం రావడం అనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం మా గ్రామం నుండి భద్రాచల రాముని కళ్యానానికి అందిస్తామన్నారు. ఇంతటి అదృష్టాన్ని కలగజేసిన రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షులు మంతెన నాగరాజు, ఆనంద్, భరత్ కుమార్, యాదగిరి, చంద్రమౌళి, వెంకటేశం, రఘు, నవీన్ గ్రామ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.