ఓసీ,బీసీ, లోకల్ నాన్ లోకల్ వైరుద్యాలు ఎందుకు అంటూ ఎమ్మెల్యే ను నిలదీసిన…. శ్రీవాణి….
తామ గ్రామం విలీనం అయ్యాక….దూరం సృష్టిస్తూ… రాజకీయాలు ఏంటి…మాకు అర్హత లేదా…..అంటూ ఆవేదన వ్యక్తం….
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాటిచ్చి మోసం చేసారంటు… కౌన్సిల్ హాలులో భువనగిరి 11వ వార్డు కౌన్సిలర్ గంజి శ్రీవాణి గణేష్ రెడ్డి కంట తడి పెట్టింది.
తామ గ్రామం విలీనం అయ్యాక దూరం సృష్టిస్తూ రాజకీయాలు ఏంటని మాకు అర్హత లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఓసీ,బీసీ, లోకల్ నాన్ లోకల్ వైరుద్యాలు ఎందుకు అంటూ ఎమ్మెల్యే ను నిలదీసింది.
చదువుకున్న వారికి అవకాశం ఇవ్వాలని అనర్హులకు అవకాశం ఇవ్వడం కులాల పేరుతో తొక్కేస్తే ఎలా అని ప్రశ్నించింది. మొదటి నుండి చైర్ పర్సన్ పదవి ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు 35వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన తంగెళ్ళపల్లి శ్రీవాణి ని ఎన్నుకోవడంపై గంజి శ్రీవాణి నిండు కౌన్సిల్లోనే కంటతడి పెట్టుకున్నారు. జనరల్ స్థానంలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుండి 11 వ వార్డు కౌన్సిలర్ గంజి శ్రీవాణి కే అధ్యక్ష పీఠం అని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో అంచనాలు అన్ని తారుమారయ్యాయి.