Take a fresh look at your lifestyle.

కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలని సంతకాల సేకరణ..

 

ముద్ర, యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్టలో యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పాత గుట్ట చౌరస్తా వద్ద నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొండపైన వర్తక సంఘం పేరుతో జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడి కొండపైన వర్తక సంఘంలోని 114 షాప్ సభ్యులు దేవస్థానం ఆస్తి వారి సొంత ఆస్తిలాగా గత కొన్నేళ్లుగా వారే అనుభవిస్తూ టెండర్ లు వేయకుండా కొత్తవారికి నిరుద్యోగులకు ఉపాధి కల్పనా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. గతం లో కేవలం కొండపైన 14 దుకాణాలు ఉండేవి కానీ అవి కాస్త ప్రస్తుతం 114 దుకాణాలు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. కొండపైన వర్తక సంఘంలోని 114 షాపుల సభ్యుల వివరాలను బయటికి వెల్లడించాలని తెలిపారు. ఇట్టి వివరాలు అన్ని అక్కడికి వచ్చిన స్థానిక ప్రజలకు నిరుద్యోగులకు వివరించారు. ఈ సంతకాల ప్రతులను సంబంధిత దేవాదాయ ధర్మాదాయ శాఖ, ప్రభుత్వ పెద్దలకు ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమం లో కాటబత్తిని ఆంజనేయులు, సుడుగు జీవన్ రెడ్డి, పల్లపు బాలయ్య, దేవపూజ అశోక్, దండబోయిన వీరేష్, బండ రామస్వామి, గ్యాదపాక బాల్ నర్సింహా, మాటూరి బాలయ్య, బుగ్గా ఆంజనేయులు, పబ్బల ఉప్పలయ్య, మిరియాల క్రిష్ణ, కల్వకొలను సతీష్, కోనె సంజీవ, బండి అనిల్, గోపగాని ప్రసాద్,కర్రే ప్రవీణ్, మందోజు నరేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.