బెదిరింపులు ఆపి కూలీ రేట్లు పెంచాలి : బిల్డింగ్ అండ్ అదర్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండు
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పెరుగుతున్న ధరలకుఅనుకూలంగా కూలి రేట్లు పెంచాలని బిల్డింగ్ అండ్ అదర్ వర్కర్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. సోమవారం పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో భవనిర్మాణ కార్మికులకు కూలి రేట్లు పెంచాలని పనులు ఆపి నిరసన తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కూలి రేట్లు పెంచాలని వెల్ఫేర్ బోర్డు కార్డు, సంక్షేమ బోర్డు కార్డును ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు మాయ కృష్ణ, నాయకులు ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్ల ముత్యాలు, పాక శంకర్, ఉడుత సోములు, తోట శేఖర్, కుచ్చుల శీను, రహిమాన్ మహబూబ్ షేక్, రాజ్కుల్ షేక్ పాల్గొన్నారు.