Take a fresh look at your lifestyle.

గణిత ఉపాధ్యాయుడిగా కలెక్టర్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు.
స్కూల్ లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది , అందులో 10 వ తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు. అన్ని సబ్జెక్ట్స్ సిలబస్ లు పూర్తి చేశారా . రోజు సాయంత్రం స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయ. ఉదయాన్నే 5 గంటలకు పిల్లకి వేక్ అప్ కాల్ చేస్తున్నారా అని అడిగారు.
అనంతరం 10 వ తరగతి విద్యార్థులకి గణితంలో ప్రశ్నలు వేసి అడిగారు. బోర్డు పై వాటికి సమాధానాలు చెప్పారు.
పరీక్షల సమయం దగ్గర పడుతుంది ఇప్పటి నుండి సిద్ధం అవ్వాలి అని చెప్పారు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులు సంఖ్య పెంచాలి అని ఉపాధ్యాయులకి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి బోధన అందుతుంది ఇప్పటి నుండే గ్రామంలో ప్రజలకి ప్రభుత్వ పాఠశాలల విద్యా బోధన పై అవగాహన కల్పించాలి గ్రామంలో ఉండే ప్రతి విద్యార్థి మన ప్రభుత్వ బడిలో చదువుకునేల చూడాలి అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.