Take a fresh look at your lifestyle.

జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

ధూప దీప నైవేద్య అర్చక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా సర్వసభ్య సమావేశం భువనగిరి పట్టణంలోని పచ్చలకట్ట సోమేశ్వరాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరికీర్తి అమరేశ్వర శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని ధూప దీప నైవేద్య అర్చకులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షుల పదవికి ఓట్లు నిర్వహించగా జోషి పవన్ కుమార్ శర్మ అధ్యక్షులుగా విజయం సాధించారు. అనంతరం అర్చకులు ఉపాధ్యక్షులుగా కొల్లావఝల శ్రీనివాస్ శర్మ, శంకు భద్రప్ప, ప్రధాన కార్యదర్శిగా నిమ్మల అమలేశ్వర్, కార్యదర్శిగా వల్లంబట్ల శ్రీనివాస శర్మ, కోశాధికారిగా మూటకొండూరు కార్తీక్ శర్మ, సహాయ కార్యదర్శిగా పసునూరి నిత్యానందం, ప్రచార కార్యదర్శిగా మంచోజు చంద్రశేఖరచార్యులు, కార్యవర్గ సభ్యులుగా మోత్కూరు ప్రదీప్ శర్మ, నేరెళ్లపల్లి హరిబాబు శర్మ, కొల్హాపూర్ మహేందర్ శర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు నారాయణ మణికంఠ శర్మ, పవన్ శర్మ, చలివేదుల రాజేశ్వర శర్మ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.