ముద్ర, హైదరాబాద్ :
కవిత ప్రవర్తనతో కుటుంబ సభ్యులు తరచూ మనస్తాపానికి గురవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కల్వకుంట్ల కవిత ‘కొత్త పార్టీ’ అంశంపై కేటీఆర్ తొలిసారిగా స్పందించారు. ఈ ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా కవితకు సూచనలు చేశారు. తల్లిదండ్రులకు మనం మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ, వారు బాధపడే పనులు మాత్రం చేయకూడదన్నారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదన్నారు. కవిత చాలా తెలివైన మహిళ, ఆమెకు రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఇలా ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని కోరుకుంటున్నాను.” అని ఆయన పేర్కొన్నారు.