Take a fresh look at your lifestyle.

స్పెషల్ డ్రైవ్ ద్వారా 107 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ

  • మొబైల్ రికవరీలలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానం.
  • జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర.

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని,సీఈ ఐఆర్ (CEIR) ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరికి గురైన 107 మొబైల్ ఫోన్లను ( సుమారు 15 లక్షల విలువగల) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. ఈ మొబైల్ రికవరీలలో రాష్ట్రంలోని జిల్లాలలో కమిషనరేట్లను మినహాయిస్తే, కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఇప్పటివరకు 3150 మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయినా లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు వెళ్ళి దరఖాస్తు ఇవ్వాలన్నారు. SIM కార్డ్ బ్లాక్ చేసి అదే నంబరు గల కొత్త SIM తీసుకోవాలని, తద్వారా పోయిన మొబైల్ ఫోన్ల IMEI వివరాలు CEIR వెబ్సైట్ లో బ్లాక్ చేయడం వలన పోగొట్టుకున్న మొబైల్ సులబంగా దొరికే అవకాశం ఉన్నదని అన్నారు.జిల్లా పోలీసు కార్యాలయములో పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక RSI, 10 మంది కానిస్టేబుల్స్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని అన్నారు. గత (7) రోజులలో ఈ టీం అధికారులు 107 ఫోన్ లను రికవరీ చేయడం జరిగింది అన్నారు.ఈ సందర్భంగా 107 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన టీం సబ్యులు అందరినీ జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలిజేయడం జరుగుతుందని, వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి RSI బాలరాజ్ ని సంప్రదించి (8712686114) ఫోన్ కు సంభంధించిన వివరాలు చూపించి తీసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.