Take a fresh look at your lifestyle.

ఐటిఐ కళాశాలలో ఏటీసీ ద్వారా ఉత్తమ శిక్షణ

 

మహాదేవపూర్, ముద్ర:

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏటీసీ (Advanced Training Centre) ద్వారా యువతకు ఉత్తమ శిక్షణ అందించి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించడం ద్వారా వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ఏటీసీ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2D, 3D మిషన్, అడ్వాన్స్డ్ సీఎన్‌సీ మిషన్, రోబోటిక్ వెల్డింగ్ మిషన్ మరియు ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రారంభించారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, ఏటీసీ కేంద్రం ద్వారా విద్యార్థులు ఆధునిక యంత్రాలపై శిక్షణ పొందుతూ తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించు కోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ జమ్మూలాల్, ఇతర అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.