Take a fresh look at your lifestyle.

అమరావతి రైతుల త్యాగ ఫలితమే రాజధాని బిల్లు ఆమోదం: నందమూరి రామకృష్ణబాబు

విజయవాడ:

పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి బిల్లు ఆమోదం పొందిన శుభ సందర్భంగా గతంలో మాకు అండగా నిలిచి మా ఉద్యమాల్లో పాలు పంచుకున్న సందర్భాలు గుర్తుచేసుకొని నందమూరి రామకృష్ణ బాబు గారిని విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన రాజధాని రైతులు.. ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ… గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా రాజధాని రైతులను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తే మాకు అండగా ఉంటూ నేనున్నాను అంటూ భరోసానిచ్చిన నందమూరి రామకృష్ణ బాబు గారికి మా రాజధాని రైతులు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చామని అన్నారు. నందమూరి రామకృష్ణబాబు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పార్టీని 11 సీట్లకు దిగజార్చినా కూడా ఆయనకు బుద్ధి రావడం లేదని, రాజధాని అమరావతి గా ఉండాలని ఆనాడు రైతులు ఉద్యమాలు చేస్తుంటే ఆడవాళ్లు అని కూడా చూడకుండా అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని వివస్త్రలని చేసి అన్యాయంగా, అక్రమంగా హింసించారని, న్యాయం ధర్మము ఎప్పటికైనా విజయం సాధిస్తుందని పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడంతో రుజువైందని, ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన రాజధాని రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పులిచిన్న, చెన్నుపాటి గాంధీ, వల్లూరు కిరణ్, బెస్త రాంప్రసాద్, దివాకర్, సొంటి శివరాం ప్రసాద్, నరసయ్య, మహమ్మద్ నూరు, చక్రి, తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.