Take a fresh look at your lifestyle.

​చిత్తారమ్మ ఆలయంలో వైభవంగా శ్రీ మహాలక్ష్మి యాగం

ముద్ర కూకట్‌పల్లి:
బ్రహ్మాది దేవతల మొదలు మానవుల వరకూ అందరికీ ఐశ్వర్యం, మంగళ సౌభాగ్యాలు ప్రసాదించే శ్రీ లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకుని కూకట్‌పల్లిలోని శ్రీ శ్రీ శ్రీ చిత్తారమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి యాగం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. శ్రీ మహాలక్ష్మి యాగ సమితి ఆధ్వర్యంలో, వడ్డేపల్లి రాజేశ్వరరావు – యామిని దంపతుల సౌజన్యంతో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.​తిరుమల తిరుపతి దేవస్థానం పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా సాగిన ఈ వేడుకల్లో ​ప్రవేశ బలి, లక్ష్మీనరసింహారాధన ​గోపూజ, లక్ష్మీనారాయణ పూజ
​శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు.​ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ.. “అమ్మవారి దయాకటాక్షాలు భక్తులపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఇంటా ఆనందం, శాంతి నెలవాలని కోరుకుంటున్నాను. సానుకూలతను, ధార్మికతను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయి,” అని పేర్కొన్నారు. కార్యక్రమ విజయానికి కృషి చేసిన యాగ సమితి సభ్యులకు, పాల్గొన్న భక్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ మహా యాగంలో రఘు గురూజీ, జి. నాగేశ్వరావు, ఏ. హనుమంతరావు, ఏ. ఆండాలమ్మ, అశోక్ యాదవ్, గొట్టిముక్కల భాస్కరరావు, మాధవరం నాగేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.