Take a fresh look at your lifestyle.

పొట్లి మహారాజ్ దేవాలయ అభివృద్ధికి కృషి . ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

 

ముద్ర, తాండూర్:

తాండూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన పోట్లీ మహారాజ్ దేవాలయం అభివృద్ధికి తన వంతు చేరితనందిస్తానని తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. దేవాలయ ప్రాంగణంలో రాజగోపురం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్లీ మహారాజ్ దేవాలయం కొరకు కృషి చేస్తానని, అదేవిధంగా దేవాలయంలో రాజగోపురం నిర్మాణం చేయడం వల్ల ఆలయ కీర్తి పెరుగుతుందని, దేవాలయ ప్రాంగణంలో దుకాణాలు నిర్మించడం వల్ల ఆలయ అభివృద్ధికి ఆదాయం చేకూరుతుందని ఆయన తెలిపారు. పాత దుకాణాల స్థానంలో కొత్త దుకాణ సముదాయాన్ని నిర్మించేందుకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్ల నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, వివిధ పార్టీల కౌన్సిలర్లు, దేవాలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.