Take a fresh look at your lifestyle.

హనుమాన్ జయంతికి పటిష్ట పోలీసు బందోబస్తు -ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్:
హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. పండుగను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని హనుమాన్ దేవాలయాలు, ఊరేగింపు మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించనునట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.
వదంతులను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తప్పుడు ప్రచారాలు, ఇతరులను కించపరిచే ప్రవర్తన, అనవసర గొడవలకు పాల్పడితే సంబంధితులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.