Take a fresh look at your lifestyle.

డివిజన్ల పునర్ విభజన పారదర్శకంగా చేయండి. అదనపు కలెక్టర్ కు మద్దెల దినేష్ వినతి

  • అధికార పార్టీ నేతల కోసం కాకుండా ప్రజలకు అనుకూలంగా విభజన చేయండి.
  • మునిసిపల్ సిబ్బంది కార్యాలయంలో కూర్చొని కాదు ముసాయిదా తయారు చేయడం డివిజన్లలో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరణ చేయాలి.
  • మద్దెల దినేష్.

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం నగర పాలక సంస్థ లో డివిజన్ల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ గందరగోళంగా ఉందని,ఎలాంటి పారదర్శకత చూపలేదని,ఎదో చేశామా అంటే చేసాం అని హడావీడిగా తప్పుల తడాకగ డ్రాఫ్టింగ్ నోటిఫికేషన్ తయారు చేసారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ విమర్శించారు.గురువారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇంచార్జ్ కమిషనర్ అరుణ శ్రీ ని కలిసి మద్దెల దినేష్ వినతి ఇవ్వడం జరిగిందని తెలిపారు.అనంతరం అయన మాట్లాడుతూ చాలామంది ఓటర్లను లెక్కించ కుండానే కేవలం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోనే సిబ్బంది కూర్చొని మొక్కుబడిగా ముసాయిదా తయారు చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు.కొన్ని డివిజన్లలోని ఓటర్లను పరిగణన లోకి తీసుకోకుండా,పార్ట్ అని పొందుపరచడంఅయోమయానికి దారితీస్తోందన్నారు.ఓటరుజాబితా పొంతన లేకుండా ఉండడం పట్ల పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తూన్నరని అన్నారు.5వ ఇంక్లైన్,పరుశురాం నగర్ 33వ డివిజన్ గా ప్రస్తుతం కొనసాగుతుంది ఇందులో సుమారు 32వందల ఓట్లు ఉండగా ఇందులోనుండి పరుశురాం నగర్ ప్రత్యేక డివిజన్ సృష్టించి 33 వ డివిజన్ లో సంబంధం లేని తిలక్ నగర్ విఠల్ నగర్ ఓట్లను చేర్చడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 33వ డివిజన్ లోని ఫైవ్ ఇంక్లైన్ లోని సుమారు ఆరు నుండి ఎనిమిది వందల ఇండ్లను ముసయిదా లో కనపడకుండా చేయడంలో ఆంతర్యం ఏమిటి అని,ఎవరి మెప్పు కోసం చేస్తున్నారని అధికార పార్టీ నేత లకు అనుకూలంగా ఉండేందుకు కోసం అధికారులు కష్టపడుతు న్నార అని ప్రశ్నించారు. తొలగించినవన్ని దాదాపు దళిత సామజిక వర్గంకు చెందిన ఇండ్లు ఓటర్లే అని,దాని వల్ల రిజెర్వెషన్లు మారిపోయే విధంగా అధికార పార్టీ నేతలు,అధికారులు కలిసి ఈ తతంగం నడిపిస్తున్నారా అని ఆరోపించారు.మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ముందుగా మున్సిపల్ కార్యాలయం వదిలేసి డివిజన్లో పర్యటిస్తూప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ అధికార పార్టీ నేతలకు అనుకూలంగా కాకుండా ప్రజలకు అనుకూలంగా విభజన ప్రక్రియ కొనసాగించాలనిడిమాండ్ చేశారు.కావాలనే దళితులు ఓటర్లను,ఇండ్లను వివక్షతతో తొలగిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని,అలాంటి ఆలోచనలు ఉంటే అధికారులు మానుకోవాలని హితువు పలికారు.దళిత డివిజన్ల రిజర్వేషన్లకు భంగం కలిపిస్తే గౌరవ హై కోర్టును ఆశ్రయిస్తామని దినేష్ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.