Take a fresh look at your lifestyle.

ఫేయింట్ షాపులో అగ్నిప్రమాదం.. షార్ట్‌ సర్క్యూటే కారణం

 

ముద్ర, గద్వాల:

  గద్వాల జిల్లా కేంద్రంలోని చిన్న అగ్రహారం సమీపం లో గల ఎం.నారాయణ కాంప్లెక్స్ లో ఓ ఫేయింట్ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంభవించింది.

సోమవారం తెల్లవారుజామున ఫేయింట్ షాప్ ముందు బాగంలో ఉన్న కిరాణం షాపు నుండి పొగలు రావడంతో స్థానికులు గమనించి దుకాణం యజమానులకు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే షాపులోని పెయింట్ డబ్బాలు, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.35 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. అదే విధంగా ముందు భాగంలో‌ఉన్న కిరాణం షాపులో కి మంటలు వ్యాపించడంతో కిరాణం షాపులోని కొంత సామాగ్రి కాలిపోవడంతో కొంత ఆస్థి నష్టం వాటిలింది. పేయింట్ షాపు పాత బిల్డింగ్‌లో ఉండటంతో మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది కొంత ఇబ్బంది పడారు. ఫేయింట్ షాపులో షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని పట్టణ పోలీసులు సందర్శించారు.

Leave A Reply

Your email address will not be published.