Take a fresh look at your lifestyle.

షార్ట్ ఫిలిమ్స్, సినిమా రంగాలలో కోసం సిద్ధిపేటలో 30 రోజుల వర్క్ షాప్

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

షార్ట్ ఫిలిమ్స్, సినిమా రంగాలలో రాణించాలని అనుకునే వారికోసం సిద్ధిపేటలో 30 రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిరంజీవి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈనెల 26 నుండి కార్యక్రమానికి సంబంధించిన పేర్ల నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోర్ సూపర్ మార్కెట్ వెనకాల గల వేద సొల్యూషన్స్ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కాగా ఫిలిం మేకింగ్ లో ఉన్న 24 డిపార్ట్మెంట్ లపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని…. సిద్దిపేట పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులు నర్సింలు, లింగమూర్తి, శ్రావణ్, స్వామి చరణ్, హరీష్, నవీన,కనక లక్ష్మీ, సుభాష్ గౌడ్ పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.