Take a fresh look at your lifestyle.

బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం.. : మంత్రి అడ్లూరి

ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ముద్ర, పెగడపల్లి:

హార్వెస్టర్ బావిలో పడి జరిగిన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో హార్వెస్టర్ బావిలో పడ్డ ప్రమాద స్థలాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

మరణించిన హార్వెస్టర్ డ్రైవర్ మధు మృతదేహాన్ని బయటకు తీసే చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన బావిని మంత్రి పరిశీలించారు.

మృతదేహాన్ని పలికితీయడానికి తగిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను ఫోన్ లో మంత్రి ఆదేశించారు. మృతదేహం వెలికి తీసిన తర్వాత పోస్టుమార్టం అయ్యేవరకు అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు కాంగ్రెస్ మండల బాధిత కుటుంబానికి అండగా నిలవాలి మంత్రి సూచించారు.

నందగిరి గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో ప్రమాదకరంగా ఉన్న బావితో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు సోమవారం నందగిరి గ్రామాన్ని సందర్శించి తగిన జాగ్రత్తలు చేపట్టాలని మంత్రి ఫోన్ లో అధికారులను ఆదేశించారు.

 

Leave A Reply

Your email address will not be published.