- గత పాలకుల నిర్లక్ష్య వల్లే తడిసిన ధాన్యం.
- వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్.
ముద్ర ప్రతినిధి, వనపర్తి: ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిపోయిన ప్రతి ధాన్యం గింజను ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, అకాల వర్షానికి రైతులు నష్టపోతున్నారని ఈ విషయం ప్రభుత్వం గమనించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయడమే కాక రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే వనపర్తి వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం తడిసి ముద్దయిందని ఆయన ఆరోపించారు.పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం వనపర్తి వ్యవసాయం మార్కెట్ యార్డులో నాసిరకపు పనులు చేపట్టి రైతులు పండించిన పంటను ఆరబోసుకోవడానికి అవకాశం లేకుండా సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేకుండా విచ్చలవిడిగా పనులు చేపట్టడం వల్లనే వర్షానికి రైతుల ధాన్యం తడిచిపోతుందని చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.మార్కెట్ యార్డులో గుంతలు గుంతలు. ఎక్కడ చూసినా వర్షపు నీరు నిలిచిందని, గత పాలకుల వల్లనే ఈ దుస్థితి నెలకొనదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతం మర్చిపోయి ప్రతిపక్ష పార్టీల నాయకులు రైతులను మభ్య పెట్టడానికి మార్కెట్ యార్డ్ పైన, ప్రభుత్వం పైన తప్పుడు నిందను మోపుతున్నారని ఆయన అన్నారు. గతంలో ఏమి చేశారో ఒకసారి ఆలోచించుకోవాలని ఆయన సూచించారు.రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ధాన్యం తడవకుండా ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మెప్మా ప్రాథమిక సహకార సంఘం పిఎసిఎస్ ల ద్వారా మార్కెట్ యార్డ్ నుంచి రైతులకు కవర్లను పంపిణీ చేశామని ఎక్కడ కూడా ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు.తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 16 నెలల సమయం కాకముందే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు సన్న వడ్లకు క్వింటాల్ మీద 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమే అన్నారు.నియోజకవర్గ ప్రజల కోసం ముఖ్యంగా రైతుల కోసం వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ 24 గంటలు ప్రజా సంక్షేమమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నారని,. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని ఆయన విమర్శించారు.7 లక్షల కోట్ల అప్పు చేసిన గత ప్రభుత్వం పాపం వల్లనే ఈ రాష్ట్రంలో ప్రజలకు దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నదని అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేపడుతూ ముందుకు సాగుతున్నారని ఆయన వెల్లడించారు.టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విచ్చలవిడిగా రైస్ మిల్లులు లేకున్నా కూడా ధాన్యాన్ని ఇచ్చినట్లు 50వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వం రైస్ మిల్లుల ప్రభుత్వం గా నడిచిందని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్ యజమానులను రైస్ మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్ట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి 15 వేల కోట్ల రూపాయల నిధులను ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించారని ఆయన తెలిపారు.ఇప్పటికైనా వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిచిన ధాన్యానికి ప్రధాన కారణం టిఆర్ఎస్ పార్టీ అని ఆయన నొక్కి చెప్పారు.అనవసరమైన రాద్ధాంతం చేయడం రైతులను తప్పుదో పట్టించడం మానుకోవాలని ఆయన హితవ్ పలికారు.ప్రజలు రైతులు ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎల్లవేళలా అండదండలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.
