Take a fresh look at your lifestyle.

కలెక్టర్, అబ్జర్వర్ సమక్షంలో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ద్వారా కేటాయింపు -జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్, జనరల్ అబ్జర్వర్ జి. రవి ల సమక్షంలో సోమవారం నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న వికారాబాద్, తాండూర్, కొడంగల్, పరిగి మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ సుధీర్,డి ఇ ఓ రేణుకా దేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.