Take a fresh look at your lifestyle.

గీతం యూనివర్శిటీకి విద్యుత్ బకాయిల కేసులో కీలక తీర్పు

నాలుగు వారాల్లో రూ.15కోట్లు డిపాజిట్ చేయండి
గీతం యూనివర్శిటీకి సుప్రీం ధర్మాసనం ఆదేశం

న్యూఢిల్లీ :

నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్‌ చేయాలని సుప్రీంకోర్టు గీతం యూనివర్సిటీని ఆదేశించింది. విద్యుత్‌ బకాయిల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు సోమవారం స్పందించింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలను గీతం యూనివర్సిటీ సుప్రీం కోర్టులో సవాలు చేయగా…. సోమవారం ఈ కేసుపై సుప్రీం విచారణ చేపట్టింది. ఇందులో వీబీసీ సంస్ధ, గీతం వర్సిటీ ఒకటేనని ఎస్పీడీసీ తమ తమ వాదనలు వినిపించాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు డిపాజిట్‌ చేయాలని స్పష్టం చేసింది. అయితే వీబీసీ ఫెర్రో అలాయస్ కంపెనీ విద్యుత్ బకాయిలకు తమకు సంబంధం లేదని గీతం యూనివర్శిటీ సుప్రీంలో వాదించింది. వీబీసీ సంస్థకు, గీతంకు ఉన్న సంబంధాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అంతవరకూ నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం యూనివర్శిటీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కాగా వీబీసీ సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం యూనివర్శిటీ రూ.118 కోట్లు బకాయిలు చెల్లించాలని లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ గతంలో నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను గీతం యూర్శిటీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ క్రమంలోనే రూ.54 కోట్లు చెల్లించాలని గీతం యూనివర్శిటీని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను గీతం యూనివర్శిటీ సుప్రీంలో సవాలు చేసింది. వీబీసీ, గీతం యూనివర్శిటీ ఒకటేనని ఎస్పీడిసీ వాదించింది. మరొకవైపు వీబీసీ చెల్లించాల్సిన బకాయీలు తమను చెల్లించమనడం చట్ట వ్యతిరేకమని గీతం యూనివర్శిటీ వాదించింది.

Leave A Reply

Your email address will not be published.