Take a fresh look at your lifestyle.

నేడు పీసీసీ అధ్యక్షులు రాకా…

ముద్ర ప్రతినిధి,భువనగిరి :
భువనగిరి పట్టణంలోని పాత వివేరా హోటల్‌ లో నేడు డీసీసీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ , భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ముఖ్య అతిథులుగా రానున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆలేరు ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు బీర్ల అయిలయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యవర్గ సభ్యుల నియామకం అయిన తర్వాత ప్రమాణ స్వీకార పదవి బాధ్యతల కార్యక్రమాన్ని పాత హోటల్‌ వివేరాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.