గొల్లపల్లి:
గొల్లపల్లి మండలం ఎనుగుమట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. సురిగినేని రాజేశ్వరరావు తల్లి చిన్నమ్మ ఇటీవల మరణించగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం రాజేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరణించిన చిన్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి ఆకాంక్షించారు. ఎనుగుమట్ల మండల గ్రామానికి చెందిన ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి ఇటీవల మరణించగా మంత్రి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. మంత్రి వెంట పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.